సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ!
ABN , Publish Date - May 02 , 2026 | 08:41 PM
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు శుభవార్త కలిగించే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణా బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ఎల్ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టుకు శుభవార్త కలిగించే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఆదివారం కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పతిరణా ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ టిమ్ సౌథీ స్పందించాడు.
‘పతిరణా గాయం నుంచి తిరిగి కోలుకున్నాడు. రెండు వారాల కిందటే జట్టుతో కలిశాడు. మైదానంలో కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు తిరిగి రావడం కేకేఆర్‌కు పెద్ద ప్లస్ అయింది. అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో జట్టు కూర్పును బట్టి పతిరణాకు అవకాశం ఇస్తాం. కానీ కచ్చితంగా ఆడతాడో? లేడో? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేను’ అని సౌథీ తెలిపాడు. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 సమయంలో పతిరణ తొడ కండరాల గాయంతో ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్‌లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్నప్పటికీ తుది జట్టులోకి తీసుకోలేదు. కాగా ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో అయినా అతడిని జట్టులోకి తీసుకుని ఆడించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన
కర్మన్‌ఘాట్ హనుమంతుడిని దర్శించుకున్న అభిషేక్ శర్మ