Share News

మెస్సి సంచలన నిర్ణయం.. ఫుట్‌బాల్‌కు గుడ్‌బై

ABN , Publish Date - Aug 31 , 2026 | 09:17 PM

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికాడు.

మెస్సి సంచలన నిర్ణయం.. ఫుట్‌బాల్‌కు గుడ్‌బై
Lionel Messi

స్పోర్ట్స్ డెస్క్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికాడు. నేటితరం ఫుట్‌బాల్ దిగ్గ‌జంగా పేరొందిన మెస్సి ఇవాళ(సోమ‌వారం) త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. మెస్సి తన అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో 207 మ్యాచ్‌లాడి 125 గోల్స్ సాధించాడు. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఆల్ టైమ్ గోల్ స్కోర‌ర్స్ జాబితాలో మెస్సి రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇటీవ‌లే జరిగిన ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో అర్జెంటీనా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా ఓడింది. గతంలో అర్జెంటీనాకు 2022 ఫిఫా ప్రపంచ కప్, 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లను మెస్సి అందించాడు.


ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిన నాటి నుంచే మెస్సీ అంత‌ర్జాతీయ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే మెస్సి మాత్రం వచ్చే ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ, కొంత‌కాలం పాటు జ‌ట్టు త‌ర‌ఫున ఆడాల‌ని తొలుత భావించాడు. కానీ త‌న రిటైర్మెంట్‌కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావించిన మెస్సీ సోమ‌వారం అకస్మాత్తుగా త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు.


'ఈ నిర్ణయం.. నా ఆత్మను తీవ్రంగా గాయపరుస్తోంది. కానీ, ఆటకు సెలవు ఇచ్చే సమయం ఆసన్నమైందని నేను గ్రహించాను. జాతీయ జట్టులో తనకు ఇక ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. యువ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావడానికి ఇదే సరైన సమయం. 20 ఏళ్లుగా అందించిన ప్రేమ, అభిమానానికి అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు' అని మెస్సి ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తుకొచ్చారు.


'నేను ఈ స్థాయిలో ఉంటడానికి సాయపడిన కుటుంబం, కోచ్‌లు, సహచరులు, జట్టు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. జాతీయ జట్టుతో గడిపిన అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. సహచరులతో కలిసి అభిమానులకు ఎన్నో మధురమైన క్షణాలు అందించగలిగినందుకు గర్వంగా ఉంది. నన్ను అర్జెంటీనియన్‌గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఇకపై జాతీయ జట్టును బయట నుంచి అభిమానించే సాధారణ అభిమానిగా ఉంటాను’ అని మెస్సి తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ నెల 8న మెస్సి తండ్రి జార్జ్ మృతి చెందిన సంగతి తెసిందే.


ఇవి కూడా చదవండి:

తిలక్ వర్మ శతకం.. ఆధిక్యంలో సౌత్ జోన్!

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

Updated Date - Aug 31 , 2026 | 09:52 PM