Share News

దులీప్ ట్రోఫీ 2026లో మహ్మద్ షమీ అరుదైన ఫీట్

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:07 PM

టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ దేశ‌వాళీ క్రికెట్‌లో త‌న బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

దులీప్ ట్రోఫీ 2026లో మహ్మద్ షమీ అరుదైన ఫీట్
Mohammed Shami

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ దేశ‌వాళీ క్రికెట్‌లో త‌న బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న షమీ.. సెంట్రల్ జోన్‌పై రెండు వికెట్లు తీసి ప్రొఫెషనల్ క్రికెట్‌లో 900 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్లలో కలిపి 900 వికెట్ల అతడి ఖాతాలో ఉన్నాయి. తద్వారా భారత్ తరఫున ప్రొఫెషనల్ క్రికెట్‌లో 900 వికెట్లు సాధించిన ఆరో బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు.


షమీ ఖాతాలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 379 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 283 వికెట్లు, టీ20ల్లో 238 వికెట్లు ఉన్నాయి. ప్రొఫెషనల్ క్రికెట్‌లో కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తొలి స్థానంలో ఉన్నారు. ఆయన ఖాతాలో 1170 వికెట్లు ఉన్నాయి. జహీర్ ఖాన్ 1168 వికెట్లతో రెండో స్థానం, జయదేవ్ ఉనద్కత్ 941 వికెట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. జవగల్ శ్రీనాథ్ 940 వికెట్లు, వినయ్ కుమార్ 923 వికెట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.


బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) 900 వికెట్ల మార్క్ అందుకున్న షమీకి అభినందనలు తెలిపింది. 'మహ్మద్ షమీకి శుభాకాంక్షలు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో 900 వికెట్లు తీసిన ఆరో టీమిండియా పేసర్‌గా నిలవడం అంత సులభం కాదు. అతని ఈ ఘనతకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గర్విస్తోంది' అని బీసీఏ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ చేతిపై కొత్త టాటూ.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఎందుకీ డ్రామాలు?.. పాక్ ప్లేయర్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఫైర్

Updated Date - Aug 31 , 2026 | 06:09 PM