Share News

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ABN , Publish Date - Aug 31 , 2026 | 07:23 PM

బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటనకు సంబంధించి రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కీలక అప్‌డేట్ ఇచ్చాడని ఓస్పోర్ట్స్ మీడియా పేర్కొంది.

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై  బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
India vs Bangladesh

స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటనకు సంబంధించి రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ వైట్-బాల్ సిరీస్ గతంలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలతో ఈ పర్యటనపై మళ్లీ ఆశలు చిగురించాయి.


వాస్తవంగా ఇరుదేశాల ప్రతిపాదిత పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. తొలుత ఈ సిరీస్ 2025 ఆగస్టులో జరగాల్సి ఉండగా, ఆ తర్వాత 2026 సెప్టెంబర్‌కు మార్చారు. అయితే ఇరుదేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తతల కారణంగా ఇది మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం ఇరు బోర్డులు ఈ సిరీస్‌ను పునరుద్ధరించే దిశగా సమాలోచనలు జరుపుతున్నాయని తెలుస్తోంది.


సెప్టెంబర్ షెడ్యూల్ అనిశ్చితంగా మారడంతో, బీసీబీ వచ్చే ఏడాది ప్రారంభంలో అనువైన విండోను కోరుతోంది. బీసీబీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ 2027 జనవరిలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగ్లా, భారత్‌కు సంబంధించి ఇరుదేశాల ప్రభుత్వాల అనుమతులు, ఇతర ఏర్పాట్లపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని బీసీబీ చీఫ్ తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నారని ఓ స్పోర్ట్స్ మీడియా తెలిపింది.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ చేతిపై కొత్త టాటూ.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఎందుకీ డ్రామాలు?.. పాక్ ప్లేయర్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఫైర్

Updated Date - Aug 31 , 2026 | 07:28 PM