Share News

సింధు జలాల ఒప్పందంపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన భారత్..

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:46 PM

భారత్-పాకిస్థాన్ మధ్య కీలకమైన 'ఇండస్ వాటర్స్ ట్రీటీ' (సింధు జలాల ఒప్పందం)పై హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తాజా తీర్పును భారత్ తిరస్కరించింది. భారత సార్వభౌమ నిర్ణయాలపై ఆ కోర్టుకు ఎలాంటి అధికారమూ లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

సింధు జలాల ఒప్పందంపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన భారత్..
Indus Waters Treaty

ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య కీలకమైన 'ఇండస్ వాటర్స్ ట్రీటీ' (సింధు జలాల ఒప్పందం)పై హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తాజా తీర్పును భారత్ తిరస్కరించింది. భారత సార్వభౌమ నిర్ణయాలపై ఆ కోర్టుకు ఎలాంటి అధికారమూ లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్ ప్రోద్బలంతో ఈ కోర్టు చట్టవిరుద్ధంగా ఏర్పాటైందని భారత్ పేర్కొంది. ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా ఈ కోర్టును ఏర్పాటు చేశారని, అందువల్ల దాని తీర్పులను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది (India Pakistan water treaty).


1960లో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ వ్యవస్థలోని జలాలను ఇరు దేశాలు ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఒప్పంద కార్యకలాపాలను నిలిపివేయాలన్న భారత్ నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని విదేశాంగ శాఖ తాజాగా మరోసారి స్పష్టం చేసింది (Hague Court ruling).


సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన మధ్యంతర చర్యలు, ఒప్పంద స్థితిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సోమవారం తీర్పు జారీ చేసింది (India rejects Hague ruling). ఈ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని, దాన్ని నిలిపివేయడానికి భారత్‌కు సరైన కారణం లేదని కోర్టు పేర్కొంది. అలాగే జమ్మూకశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కొన్ని అంశాలపై కూడా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే ఈ తీర్పును భారత్ పూర్తిగా తిరస్కరించింది. తాజా పరిణామంతో భారత్-పాకిస్థాన్ మధ్య నీటి వివాదం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..


పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Aug 31 , 2026 | 06:49 PM