Share News

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండా చీరతోనే పరిగెత్తి..

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:31 PM

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల రమాబాయి రణ్‌వీర్ ఇందుకు గొప్ప ఉదాహరణగా నిలిచారు. కూతురి చదువు ఫీజు కోసం మారథాన్‌లో పాల్గొన్న ఆమె.. చెప్పులు కూడా లేకుండా చీరతోనే పరుగెత్తి విజేతగా నిలిచారు.

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండా చీరతోనే పరిగెత్తి..
47-year-old mother marathon

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల రమాబాయి రణ్‌వీర్ ఇందుకు గొప్ప ఉదాహరణగా నిలిచారు. కూతురి చదువు ఫీజు కోసం మారథాన్‌లో పాల్గొన్న ఆమె.. చెప్పులు కూడా లేకుండా చీరతోనే పరుగెత్తి విజేతగా నిలిచారు. బహుమతిగా వచ్చిన రూ.3,000ను తన కూతురి చదువు కోసం ఉపయోగించనున్నారు (47-year-old mother marathon).


మహారాష్ట్రలోని అంబాజోగైలో ఖోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా 'అమృత్ దౌడ్' మారథాన్ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుంచి భాగ్యనగర్ చౌక్ వరకు ఈ పరుగు సాగింది. ఈ పోటీలో పలువురు యువతీ యువకులు స్పోర్ట్స్ షూస్, ట్రాక్‌సూట్లతో పాల్గొన్నారు. రమాబాయి మాత్రం సాధారణ చీర, చెప్పులతోనే పోటీకి వచ్చారు. ఆమె విజేతగా నిలుస్తారని అక్కడున్నవారు ఊహించలేదు (Mother runs barefoot for money).


పరుగు ప్రారంభమైన కొద్దిసేపటికే రమాబాయి చెప్పులు జారిపోతుండడంతో వేగంగా పరుగెత్తడం కష్టంగా మారింది. దీంతో ఆమె చెప్పులను చేతితో పట్టుకుని ఒట్టి కాళ్లతోనే పరిగెత్తడం ప్రారంభించారు. చీరను కూడా సర్దుకుంటూ ఆమె వేగంగా పరిగెత్తారు. స్పోర్ట్స్ షూస్ ధరించిన యువ రన్నర్లు ఒక్కొక్కరినీ వెనక్కి నెట్టి రమాబాయి ఫినిషింగ్ లైన్‌ను అందరికంటే ముందుగా చేరుకున్నారు. దీంతో మారథాన్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు (Inspiring mother story).


మారథాన్‌లో మొదటి స్థానం సాధించిన రమాబాయికి రూ.3,000 నగదు బహుమతి లభించింది. ఈ మొత్తాన్ని తన కూతురి చదువుకు, ఫీజు చెల్లించేందుకు ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె విజయం చూసిన ప్రేక్షకులు, నిర్వాహకులు భావోద్వేగానికి గురయ్యారు. ఒక తల్లి తన పిల్లల చదువు కోసం చూపించిన పట్టుదలకు అభినందనలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..


పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Aug 31 , 2026 | 06:36 PM