తిలక్ వర్మ శతకం.. ఆధిక్యంలో సౌత్ జోన్!
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:10 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ శతకంతో చెలరేగాడు. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు సారథ్యం వహిస్తున్న తిలక్.. నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో అజేయ సెంచరీతో సత్తా చాటాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సెంచరీతో చెలరేగాడు. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ2026లో సౌత్‌జోన్‌కు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో అజేయ సెంచరీతో సత్తా చాటాడు. 225 బంతుల్లో 7 ఫోర్లతో 106 నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ సెంచరీతో సౌత్ జోన్ ఆధిక్యంలోకి వచ్చింది.
తొలి ఇన్నింగ్స్‌లో 40/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు, సోమవారం ఆటను కొనసాగించిన సౌత్ జోన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 285/9 స్కోరు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 90 పరుగుల ఆధిక్యంలో ఉంది. నార్త్ జోన్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్(4/70) నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ తలో రెండు వికెట్లు తీశారు. 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ.. శ్రేయస్ గోపాల్‌తో కలిసి ఆదుకున్నాడు. తిలక్ వర్మతో పాటు ఏడో స్థానంలో వచ్చిన శ్రేయస్ గోపాల్ బాగా రాణించాడు.
శ్రేయస్ గోపాల్ 169 బంతుల్లో 88 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న తిలక్ వర్మపై ప్రశసంల జల్లు కురుస్తుంది. మరోవైపు సౌత్ జోన్ బౌలర్ విద్వత్ కావేరప్ప (4/66) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్‌ను 195 పరుగులకే ఆలౌటైంది.
ఇవి కూడా చదవండి:
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
దులీప్ ట్రోఫీ 2026లో మహ్మద్ షమీ అరుదైన ఫీట్