Share News

దులీప్ ట్రోఫీ: నార్త్ జోన్ కెప్టెన్‌గా కన్హయ్య వాధ్వాన్.. అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్

ABN , Publish Date - Aug 04 , 2026 | 08:42 AM

ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందుకోసం నార్త్ జోన్ జట్టును ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన 24 ఏళ్ల వికెట్‌కీపర్, బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని వైస్ కెప్టెన్‌గా నియమించారు.

దులీప్ ట్రోఫీ: నార్త్ జోన్ కెప్టెన్‌గా కన్హయ్య వాధ్వాన్.. అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్
Duleep Trophy 2026

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందుకోసం నార్త్ జోన్ జట్టును ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన 24 ఏళ్ల వికెట్‌కీపర్, బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని వైస్ కెప్టెన్‌గా నియమించారు. భారత స్టార్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, అంశుల్ కాంబోజ్‌ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే పంజాబ్ స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లకు ఛాన్స్ దక్కలేదు.


ఇటీవల రంజీ ట్రోఫీని గెలిచిన జమ్మూకశ్మీర్ జట్టు నుంచి కన్హయ్య వాధ్వాన్‌తో పాటు కమ్రాన్ ఇక్బాల్, అబ్దుల్ సమద్, అబిద్ ముష్తాక్, సునీల్ కుమార్, యుధ్వీర్ సింగ్‌లకు జట్టులో అవకాశం కల్పించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన కన్హయ్య.. 883 పరుగులు చేశాడు. 2018-19 రంజీ సీజన్‌లో 17 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన అతడు నిలకడైన ప్రదర్శనతో గుర్తింపు పొందాడు. 41 ఏళ్ల సీనియర్ ఆటగాడు పరాస్ డోగ్రాకు ఈసారి అవకాశం ఇవ్వలేదు. ఈ టోర్నీ జరిగే సమయంలోనే భారత జట్టుతో శ్రీలంక పర్యటనలో ఉండనుంది. అందుకోసం శుభ్‌మన్ గిల్, ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు.


నార్త్ జోన్ జట్టు:

కన్హయ్య వాధ్వాన్(కెప్టెన్), సనత్ సాంగ్వాన్, కమ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసెజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని(వైస్ కెప్టెన్), నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్‌దీప్ సింగ్, సునీల్ కుమార్, అంశుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్


ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 08:42 AM