Share News

ఫుడ్‌ పాయిజనింగ్‌.. లేదంటే స్వర్ణం వచ్చేది

ABN , Publish Date - Aug 04 , 2026 | 04:49 AM

కామన్వెల్త్‌ క్రీడలకు ముందు ఫుడ్‌ పాయిజన్‌తో డయేరియా బారిన పడ్డానని, లేదంటే గ్లాస్గోలో స్వర్ణం సాధించి ఉండేవాడినని ట్రిపుల్‌ జంపర్‌ సెల్వ...

ఫుడ్‌ పాయిజనింగ్‌.. లేదంటే స్వర్ణం వచ్చేది

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడలకు ముందు ఫుడ్‌ పాయిజన్‌తో డయేరియా బారిన పడ్డానని, లేదంటే గ్లాస్గోలో స్వర్ణం సాధించి ఉండేవాడినని ట్రిపుల్‌ జంపర్‌ సెల్వ ప్రభు అన్నాడు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌ (16.58 మీ.) రజతం, ప్రభు సెల్వ (16.52 మీ.) కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. చిత్రవేల్‌, ప్రభు ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం. ‘నాకు స్వర్ణం లభిస్తుందని అనుకున్నా. కానీ పోటీలకు వారం రోజుల ముందు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి డయేరియా బారిన పడ్డా. దాంతో నీరసించిపోయా’ అని సెల్వ వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 04:49 AM