భారత సైక్లిస్ట్ హర్షిత చరిత్ర
ABN , Publish Date - Aug 04 , 2026 | 04:48 AM
ప్రతిష్ఠాత్మక ‘టూర్ డి ఫ్రాన్స్ ఫెమీ్‌స’లో పాల్గొన్న తొలి భారత సైక్లి్‌స్టగా హర్షి త జాఖర్ చరిత్ర సృష్టించింది..
టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్న ఘనత
ఐజిల్ (స్విట్జర్లాండ్): ప్రతిష్ఠాత్మక ‘టూర్ డి ఫ్రాన్స్ ఫెమీ్‌స’లో పాల్గొన్న తొలి భారత సైక్లి్‌స్టగా హర్షి త జాఖర్ చరిత్ర సృష్టించింది. పురుషుల టోర్నీ అనంతరం ప్రతి ఏటా జూలై లేదా ఆగస్టులో మహిళల ఈవెంట్ జరుగుతుంది. రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల హర్షిత.. అఫ్ఘానిస్థాన్, అల్జీరియా, చిలీ, ఇథియోపియా, నమీబియా, ఉగాండాకు చెంది న 8మంది సైక్లి్‌స్టలతో కూడిన బృందంలో సభ్యురాలిగా పాల్గొంది. అయితే ఈ బృందం పాల్గొన్నది ప్రధాన పోటీకాదు. సైక్లింగ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న 8 దేశాలకు చెందిన సైక్లిస్టులను ఈ వేడుకకు ఆహ్వానిస్తారు. ప్రధాన పోటీ ఆరంభానికి ముందు 4.5 కి.మీ రేసులో పాల్గొని వీరు తప్పుకొంటారు. అనంతరం ప్రధాన పోటీ కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ