ఆర్బీఐ బ్యాంకు ఉద్యోగిగా ఇషాన్ కిషన్.. ఫొటోలు వైరల్!
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:42 PM
భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంక్‌కు వెళ్లిన ఇషాన్.. సహ ఉద్యోగులతో ఫొటోలు దిగాడు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అనివార్య కారణాల వల్ల జట్టుకు దూరమైన ఇషాన్.. మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. నిలకడైన ఆటతీరుతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు ప్రస్తుతం శ్రీలంకతో రెండు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ జట్టులో ఇషాన్ కిషన్ లేడు. టీమిండియా తదుపరి టీ20 సిరీస్ అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది. దీనికి ముందు దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌ను ఇషాన్ నడిపించనున్నాడు. ఆగస్టు 23 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ కొద్దిపాటి విరామంలో అతడు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో విధులు నిర్వర్తించడానికి ఝార్ఖండ్ బ్రాంచ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
అగార్కర్‌పై వేటు?.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!
చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!