లార్డ్స్‌లో పరుగులు చేయకపోయినా కోహ్లీ స్థాయి తగ్గదు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Jul 20 , 2026 | 06:04 PM
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో పరుగులు చేశాడా? లేదా? అన్నదానితో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని కొలవలేమని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో కోహ్లీ అర్థశతకం చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో పరుగులు చేశాడా? లేదా? అన్నదానితో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని కొలవలేమని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో కోహ్లీ అర్థశతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటికే తన స్థాయిని నిరూపించుకున్నాడని, అతడి తాజా ఇన్నింగ్స్‌ను ఒక వేదికతో ఎందుకు పోలుస్తున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. లార్డ్స్ మైదానంలో పరుగులు చేయడాన్ని ప్రత్యేకంగా చూడటంపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు లేవనెత్తాడు.
‘లార్డ్స్‌లో పరుగులు చేయడం ఎందుకు అంత ముఖ్యంగా భావిస్తారో నాకు ఎప్పుడూ అర్థం కాదు. విరాట్ ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న స్టేడియాల్లో పరుగులు చేశాడు. లార్డ్స్‌లో అర్ధశతకం చేయకపోతే అతడి స్థాయి తగ్గిపోతుందా? అసలు లేదు కదా. భారత క్రికెట్ అభిమానుల దృష్టిలోనూ అతడి విలువ మారదు. విరాట్ కోహ్లీ ఒక మాస్టర్.. పరుగుల దాహం తీరని ఓ వీరుడు. అతను ఎప్పటికీ మాస్టరే’ అని పఠాన్ వెల్లడించాడు.
పరిస్థితికి తగ్గట్టు ఆడాడు..
లక్ష్య ఛేదనలో కోహ్లీ చూపించిన పరిణతిని కూడా పఠాన్ ప్రశంసించాడు. ‘ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 45 పరుగుల దశకు చేరుకున్న తర్వాత రన్‌రేట్ పెరుగుతోందని గుర్తించి ఆట వేగాన్ని పెంచాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నాడు. కోహ్లీ ఇంకొంత సేపు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!
రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన