Share News

ఇప్పుడు మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం: ఐర్లాండ్ కెప్టెన్

ABN , Publish Date - Jun 29 , 2026 | 07:42 AM

భారత్‌పై రెండు టీ20ల్లోనూ సంచలన విజయాలు నమోదు చేసిన ఐర్లాండ్.. సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా మ్యాచ్ అనంతరం తమ విజయంపై ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ స్పందించాడు.

ఇప్పుడు మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం: ఐర్లాండ్ కెప్టెన్
Ireland captain Lorcan Tucker

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై రెండు టీ20ల్లోనూ సంచలన విజయాలు నమోదు చేసిన ఐర్లాండ్.. సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన తొలి సిరీస్‌లోనే పసికూన ఐర్లాండ్‌పై టీమిండియా చిత్తు అయింది. తొలి టీ20 విజయం అదృష్టంగా వచ్చింది కాదని నిరూపిస్తూ.. ఐర్లాండ్ రెండో మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి ఒక్క పరుగు తేడాతో గెలిచింది. కాగా మ్యాచ్ అనంతరం తమ విజయంపై ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ స్పందించాడు.


‘భారత్‌పై విజయాన్ని ఇప్పటికీ పూర్తిగా నమ్మలేకపోతున్నా. తొలి మ్యాచ్ తర్వాత అదృష్టంగా వచ్చిన విజయమని ఎవరూ అనుకోవద్దని.. అదే స్థాయి ప్రదర్శన మళ్లీ చేయాలని మా ప్లేయర్లకు చెప్పాను. ఆ సవాలును వారు అద్భుతంగా స్వీకరించారు. ఈ సిరీస్‌లో మా ప్లేయర్లు ప్రొఫెనషనల్‌గా వ్యవహరించారు. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆడితే విజయాలు సాధించొచ్చని మరోసారి నిరూపించాం. అంతర్జాతీయ క్రికెట్‌లో మేము తరచూ వెలుగులో ఉండం. మా గురించే ఎవరికీ తెలియదు. కానీ భారత్‌పై ఈ సిరీస్ తర్వాత మాత్రం మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం. మా జట్టులో చాలా మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అనుభవం తక్కువ. అయినప్పటికీ తమ సామర్థ్యాన్ని నిరూపించి ప్రపంచంలోని అత్యుత్తమ జట్టును ఓడించగలమని చూపించారు. భారత్ వంటి జట్టుతో ఆడే అవకాశం రావడం మాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. స్టేడియానికి వచ్చిన అభిమానులు, టీవీల్లో మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి మా ప్రదర్శన స్ఫూర్తినిచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఐర్లాండ్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఉండటం నిజంగా గొప్ప అనుభూతి’ అని లోర్కాన్ టక్కర్ వెల్లడించాడు.


మ్యాచ్ విషయానికొస్తే.. తొలి టీ20లో 34 పరుగుల తేడాతో భారత్ చిత్తు అయిన సంగతి తెలిసిందే. కాగా రెండో టీ20లోనూ అదే స్థాయిలో ప్రదర్శన కనబర్చిన ఐర్లాండ్.. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మూన్‌డ్రా అద్భుత ప్రదర్శన చేసి భారత టాపార్డర్‌ను దెబ్బతీశాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు వచ్చాయి.


ఇవి కూడా చదవండి:

కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్?

ప్రపంచ రోయింగ్ కప్: భారత్‌కు స్వర్ణం

Updated Date - Jun 29 , 2026 | 07:42 AM