ఐపీఎల్ 2027 వేలానికి వేదిక ఖరారు.. ఎక్కడో తెలుసా?
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:19 PM
ఐపీఎల్ 2027 వేలానికి వేదిక ఖరారైంది. ఈసారి వేలాన్ని భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో గోవా వేదికగా మెగా వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 వేలానికి వేదిక, తేదీలు దాదాపు ఖరారయ్యాయి. ఈసారి వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. డిసెంబర్ మధ్యలో గోవా వేదికగా ఐపీఎల్ 2027 వేలం జరగనుంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో వేలం నిర్వహించే అవకాశముందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ బుధవారం వెల్లడించారు.
‘వేదికగా గోవాను ఖరారు చేశాం. డిసెంబర్ 15, 16 తేదీలు ఖరారయ్యే అవకాశముంది’ అని అరుణ్ ధుమాల్ తెలిపారు. ఐపీఎల్ వేలం గత మూడు ఎడిషన్లుగా విదేశాల్లో జరిగింది. దుబాయ్, జెడ్డా (మెగా వేలం), అబుదాబి వేదికలుగా నిలిచాయి. ఈసారి వేలాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావాలని ముందుగానే నిర్ణయించినట్లు ధుమాల్ గతంలో వెల్లడించారు. ఐపీఎల్-2027 మినీ వేలం కావడంతో ఒక రోజే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో ఏదో ఒక రోజున వేలం జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా గోవాలో డిసెంబర్‌లో ఐపీఎల్-2027 వేలం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ మహిళల మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదిక మారింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను మొహాలీకి తరలించారు. భారీ వర్షాల కారణంగా ధర్మశాల మైదానం అవుట్‌ఫీల్డ్ దెబ్బతినడంతో పాటు.. అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మ్యాచ్ ఇక మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: చైనాపై ఓటమి.. భారత బ్యాడ్మింటన్ టీమ్‌కు కాంస్యం
మెడల్ మిస్.. జస్పాల్ రాణాను గుర్తు చేసుకుంటూ మను భాకర్ భావోద్వేగం