జపాన్‌లో బుమ్రా స్పెషల్ షాపింగ్.. భార్య సంజన రియాక్షన్ వైరల్
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:42 PM
ఆసియా క్రీడల కోసం జపాన్‌కు వెళ్లిన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆటకు కాస్త విరామం దొరకడంతో షాపింగ్‌కు వెళ్లాడు. తనకు నచ్చిన దిండు కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల కోసం జపాన్‌కు వెళ్లిన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆటకు కాస్త విరామం దొరకడంతో షాపింగ్‌కు వెళ్లాడు. తనకు నచ్చిన దిండు కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఇందుకోసం ఏకంగా జపాన్‌లోని ఓ ప్రత్యేక బెడ్డింగ్ స్టూడియోకు వెళ్లాడు. మరో ప్లేయర్ అక్షర్ పటేల్ కెమెరామెన్‌గా మారి ఈ సరదా సన్నివేశాలను వీడియో తీశాడు.
సాధారణంగా షాపుకెళ్లి దిండు ఎంచుకుని తీసుకురావడం కాదు.. బుమ్రా కోసం ప్రత్యేకంగా కొలతలు తీసుకున్నారు. మెడ, వెన్ను, శరీర ఆకృతిని పరిశీలించి.. అతడికి ఎలాంటి సపోర్ట్ అవసరమో తెలుసుకుని దిండు తయారు చేసి ఇచ్చారు. ఈ మొత్తం ప్రక్రియను అక్షర్ తన కెమెరాలో బంధించాడు. దీనిపై బుమ్రా కూడా సరదాగా స్పందించాడు. ‘పెద్దవాళ్ల కోసం స్పెషల్ పిల్లో’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. అనంతరం ఈ అనుభవానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘సరైన దిండును కనుగొనే కళ’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
భార్య సంజన సెటైర్
బుమ్రా పోస్ట్ చూసిన అతడి భార్య, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ సంజన గణేశన్ భర్తపై సరదాగా కామెంట్ చేసింది. ‘ఇది చేయడానికి ఏకంగా జపాన్ వరకు వెళ్లావా?’ అంటూ నవ్వుతున్న ఎమోజీతో కామెంట్ చేసింది. దీనికి బుమ్రా కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘నువ్వు అడిగినప్పుడు ఈ దిండును మాత్రం షేర్ చేయను’ అంటూ చమత్కరించాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: చైనాపై ఓటమి.. భారత బ్యాడ్మింటన్ టీమ్‌కు కాంస్యం
మెడల్ మిస్.. జస్పాల్ రాణాను గుర్తు చేసుకుంటూ మను భాకర్ భావోద్వేగం