Share News

ఐపీఎల్ 2026: గిల్, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీలు.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 09 , 2026 | 09:28 PM

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రాజస్థాన్‌కు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: గిల్, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీలు.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే?
GT vs RR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రాజస్థాన్‌కు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(84; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్(55; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


బట్లర్(13) నిరాశ పర్చారు. వాషింగ్టన్ సుందర్(37*; 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా(14*; 4 బంతుల్లో 2 ఫోర్లు) ఆఖరిలో దూకుడుగా ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2, యశ్ రాజ్, రవీంద్ర జడేజా తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని

ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి

Updated Date - May 09 , 2026 | 09:28 PM