ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
ABN , Publish Date - May 09 , 2026 | 07:15 PM
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్ఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్ఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే రియాన్ పరాగ్ స్థానంలో యశస్వి జైస్వాల్ ఆర్ఆర్‌కు నాయకత్వం వహించనున్నాడు. టాస్ సమయంలోనూ యశస్వినే కనిపించాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రియాన్ దూరమైన్నట్లు యశస్వి టాస్ సందర్భంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ఈ ఇరు జట్లలో గెలిచిన జట్టు అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండి.. భారీ తేడాతో విజయం సాధించిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌కి వెళ్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబాడా, సిరాజ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రసిద్ధ్ కృష్ణ, ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుషాగ్రా
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), హిట్‌మేయర్, డొనొవాన్ ఫెర్రీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబె, డాసున్ శనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్ పుంజా
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మైన్, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని
ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి