Share News

ఐపీఎల్ 2026: సీఎస్కే మ్యాచ్‌లకు అత్యధిక వ్యూస్

ABN , Publish Date - May 09 , 2026 | 09:17 PM

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. దాదాపు లీగ్ స్టేజ్ కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో మే 1 వరకు జరిగిన మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ డేటా లెక్కల ఆధారంగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ నివేదికను రూపొందించింది. సీఎస్కే మ్యాచ్‌లకు అత్యధిక మంది వీక్షిస్తున్నట్లు అందులో వెల్లడైంది.

ఐపీఎల్ 2026: సీఎస్కే మ్యాచ్‌లకు అత్యధిక వ్యూస్
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. దాదాపు లీగ్ స్టేజ్ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ సమరానికి మరో 19 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్ల మధ్య పోటీనైతే ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో మే 1 వరకు జరిగిన మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ డేటా లెక్కల ఆధారంగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ నివేదికను రూపొందించింది. సీఎస్కే మ్యాచ్‌లకు అత్యధిక మంది వీక్షిస్తున్నట్లు అందులో వెల్లడైంది. చెన్నై మ్యాచ్‌లను సగటున 308 మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. అయితే స్టార్ ప్లేయర్ ధోని ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ సీఎస్కే మ్యాచ్‌లకు ఈ స్థాయిలో క్రేజ్ ఉండటం విశేషం.


ఇదిలా ఉంటే, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తోన్న డిఫెండింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాచ్‌లకు సగటున 303 మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. అత్యధిక వ్యూస్ జాబితాలో ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోయినప్పటికీ ఎంఐకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎంఐ మ్యాచ్‌లను సగటున 293 మిలియన్ల మంది వీక్షిస్తున్నట్లు స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. ఎస్ఆర్‌హెచ్(290 మిలియన్లు), కేకేఆర్(280 మిలియన్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని

ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి

Updated Date - May 09 , 2026 | 09:17 PM