ఆలస్యంగా ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Feb 27 , 2026 | 08:54 PM
ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. తొలుత ప్రకటించినట్లుగా మార్చి 26న కాకుండా.. రెండు రోజులు ఆలస్యంగా ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. తొలుత ప్రకటించినట్లుగా మార్చి 26న కాకుండా.. రెండు రోజులు ఆలస్యంగా ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంటే మార్చి 28న మొదలై ఫైనల్ మే 31న జరగుతుంది. కొత్త సీజన్‌కు ముందు ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలక కాస్త సమయం ఇచ్చేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఐపీఎల్ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సాధారణంగా నెల రోజుల ముందే ఐపీఎల్ సీజన్ షెడ్యూల్‌ను కమిటీ ప్రకటిస్తుంది. కానీ ఎన్నికల కారణంగా ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల తేదీలపై స్పష్టత రాలేదు. దీంతో బీసీసీఐ కూడా వేచి చూస్తోంది. ఆయా వేదికల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లు ఉండగా.. రాజస్థాన్ రాయల్స్‌కు గువాహటి రెండో హోం గ్రౌండ్‌గా ఉంది. ఎన్నికలు, మ్యాచ్‌ల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకే ఆలస్యమవుతోందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి అవసరమైతే రెండు దశల్లో షెడ్యూల్‌ను రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. కాగా రానున్న వారం రోజుల్లో బీసీసీఐ నుంచి ఈ విషయంపై ప్రకటన ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి షెడ్యూల్, వేదికలను కూడా అప్పుడే వెల్లడించే అవకాశం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్