ఐపీఎల్ 2026: సంజు శాంసన్ సూపర్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 213
ABN , Publish Date - Apr 11 , 2026 | 09:22 PM
ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ నమోదైంది. అది కూడా బ్యాడ్‌లక్ ప్లేయర్ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సీఎస్కే స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ బ్యాట్ నుంచి! టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ నమోదైంది. అది కూడా బ్యాడ్‌లక్ ప్లేయర్ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సీఎస్కే స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ బ్యాట్ నుంచి! ఆటలో నిలకడ ఉండదు.. ఫామ్‌లో లేడు.. చెన్నై అతడిని అనవసరంగా తీసుకుంది.. అంటూ సంజు శాంసన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆఖరి మూడు మ్యాచుల్లో అతడు చేసిన స్కోర్ 9,7,6 మరి! ఎట్టకేలకు ఫామ్ అందుకున్న సంజు శాంసన్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెలరేగాడు. 56 బంతుల్లోనే 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఏకంగా 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2026లోనే ఇది తొలి సెంచరీ కావడం విశేషం
చెపాక్ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజు శాంసన్(115*) సూపర్ సెంచరీతో చెలరేగాడు. యువ ప్లేయర్ ఆయుశ్ మాత్రే(59; 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్(15) మరోసారి నిరాశపర్చాడు. ఆఖర్లో వచ్చిన శివం దూబె(20; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. చెన్నై బ్యాటర్లను ఔట్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పడిన ఒకే ఒక్క వికెట్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కే దక్కింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220
బాల్ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలి.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు