Share News

ఐపీఎల్ 2026: అరుదైన రికార్డు.. కోహ్లీ సరసన చేరిన రోహిత్ శర్మ

ABN , Publish Date - May 20 , 2026 | 10:00 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ 2026: అరుదైన రికార్డు.. కోహ్లీ సరసన చేరిన రోహిత్ శర్మ
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు నెలకొల్పాడు. లీగ్‌లో కనీసం ఒక సిక్సర్‌తో అత్యధికంగా 144 మ్యాచులాడిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ 2 సిక్స్‌లు బాది ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రో-కో ఇప్పటి వరకు 28 మ్యాచ్‌ల చొప్పున ఆడటం విశేషం.


మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. ఈ వార్త రాసే సమయానికి 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. కోల్‌కతాలో వర్షం కారణంగా కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. వాన తగ్గడంతో తిరిగి ప్రారంభమైంది. ర్యాన్ రికెల్టన్(6), రోహిత్ శర్మ(15), నమన్ ధీర్(0), సూర్యకుమార్ యాదవ్(15), తిలక్ వర్మ(20) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్య(26*), విల్ జాక్స్(5*) ఉన్నారు. కేకేఆర్ బౌలర్లలో గ్రీన్ 2, సౌరభ్ దూబె 2, కార్తిక్ త్యాగి 1 వికెట్ పడగొట్టారు. ఈ పోరులో కేకేఆర్ నెగ్గితేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

Updated Date - May 20 , 2026 | 10:00 PM