ఐపీఎల్ 2026: ప్రభ్‌సిమ్రన్, స్టోయినిస్ హాఫ్ సెంచరీలు.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Apr 28 , 2026 | 09:16 PM
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆర్ఆర్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆర్ఆర్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్, స్టోయినిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖరి ఓవర్లో స్టోయినిస్ భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మ్యాచ్ ఆరంభంలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన ఆర్ఆర్.. ఆఖర్లో తడబడింది.
ప్రభ్‌సిమ్ర్(59; 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), స్టోయినిస్(62*; 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. ప్రియాంశ్ ఆర్య(29; 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కూపర్ కనోలి(30; 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(30; 27 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), సూర్యాంశ్(3*) పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 2, జోఫ్రా ఆర్చర్ 1, బర్గర్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ