ఐపీఎల్ 2026: ధోనీ ఎంట్రీ.. భావోద్వేగానికి గురైన యువతి
ABN , Publish Date - Mar 22 , 2026 | 09:02 PM
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ‘రోర్ 2026’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ‘రోర్ 2026’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫ్రాంచైజీ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వేర్వేరు జట్లుగా ఏర్పడి సరదాగా ఓ మ్యాచ్ ఆడారు. అయితే ఈ మ్యాచ్‌కు ధోనీ రావడంతో స్టేడియం హోరెత్తింది. ఓ యువతి ధోనీని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎస్కే ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో మునిగిన సమయంలో ధోనీ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఒక్కసారిగా స్టేడియమంతా ధోనీ నామ స్మరణతో మార్మోగిపోయింది. అయితే ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ‘ధోనికిదే ఆఖరి సీజన్’ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అతడిని నేరుగా చూసిన అభిమానులు దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు.

సీఎస్కే మాజీలు.. ఇప్పుడిలా..
ఇప్పటి వరకు సీఎస్కే ఐదు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడిన సంగతి తెలిసిందే. టీమ్ తొలినాళ్లలో ఆడిన సీనియర్ ఆటగాళ్లతో ప్రస్తుత జట్టుకు చెన్నైలో మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్లు మరోసారి మైదానంలోకి దిగి అభిమానులను అలరించారు. వారి ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే తమ ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు
చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!