ఐపీఎల్ 2026: నడవలేని స్థితిలో హర్షిత్ రాణా.. చాలా మ్యాచ్‌లకు దూరం!
ABN , Publish Date - Mar 17 , 2026 | 09:51 AM
ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కేకేఆర్ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణా మోకాలి సర్జరీ చేయించుకుని రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే హర్షిత్ ఇప్పట్లో మైదానంలో అడుగు పెట్టే సూచనలు కనిపించడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఇటీవల టీ20 ప్రపంచ కప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోకాలి సర్జరీ చేయించుకుని రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే హర్షిత్ ఇప్పట్లో మైదానంలో అడుగు పెట్టే సూచనలు కనిపించడం లేదు. ఐపీఎల్‌లో దాదాపు చాలా మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
బంగ్లా-భారత్ ఉద్రిక్తతల నడుమ బీసీసీఐ ఆదేశాలతో బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ జట్టులోంచి తప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడి స్థానంలో ముజరబానీని తీసుకున్నారు. అయితే హర్షిత్ రాణా గాయపడటం వల్ల కేకేఆర్ బౌలింగ్ లైనప్ బలహీనపడిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. వేలంలో రూ.18కోట్లకు కొనుగోలు చేసిన శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరానా కూడా గాయం బారిన పడి టీ20 ప్రపంచ కప్ టోర్నీకి దూరమయ్యాడు. అతడు కూడా కేకేఆర్ తరఫున మ్యాచుల్లో బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది సందేహంగా మారింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?