ఐపీఎల్ 2026: సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
ABN , Publish Date - Mar 17 , 2026 | 08:05 AM
ఐపీఎల్ 2026.. మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌ను ప్రకటించింది. ఈ సీజన్‌లో సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ పోస్టర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026.. మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పలు ఫ్రాంచైజీలు జట్లలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌ను ప్రకటించింది. ఈ సీజన్‌లో సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫోస్టర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
45 ఏళ్ల ఫోస్టర్.. సీఎస్కే కోచింగ్ బృందంలో హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లేమింగ్ నాయకత్వంలో పని చేయనున్నారు. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్‌గా మైఖేల్ హుస్సే, బౌలింగ్ కోచ్‌గా సిమోన్స్ ఉన్న విషయం తెలిసిందే. ‘మా ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్‌కు స్వాగతం. ఎన్నో అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఎంతో అనుభవం ఉన్న ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ ఇప్పుడు సీఎస్కేతో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారు’ అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.
2001లో క్రికెట్ అరంగేట్రం చేసిన ఫోస్టర్ ఇంగ్లండ్ తరఫున 7 టెస్టులు, 11 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆటగాడిగా మాత్రమే కాకుండా కోచ్‌గా కూడా విశేష అనుభవం సంపాదించాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో కోచింగ్ సిబ్బందిగా పని చేసిన అనుభవం అతనికి ఉంది. ఇటీవల జరిగిన ఐఎల్టీ20 టోర్నీలో డిసెర్ట్ వైపర్స్ జట్టుతో టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే బర్మింగ్‌హామ్ ఫొనెక్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026లో సీఎస్కే తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. అనంతరం ఏప్రిల్ 4న స్వస్థలంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!