జట్టులో లేకపోయినా అత్యుత్తమ క్రికెటర్‌ననే నమ్మకం నాకుంది: లివింగ్‌స్టోన్
ABN , Publish Date - Mar 17 , 2026 | 09:17 AM
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను జట్టు నుంచి అనూహ్యంగా తప్పించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌నకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను జట్టు నుంచి అనూహ్యంగా తప్పించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌నకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెకెల్లమ్, మేనేజింగ్ డైరెక్టర్ రోబ్ కీల వ్యవస్థ తనకు అన్యాయం చేసిందన్నాడు.
‘నన్ను ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేదు. నన్ను తీసేస్తున్నట్టు కాల్ చేసి చెప్పారు. ఆ ఫోన్ కాల్‌లో నాతో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. ఎందుకు నన్ను తప్పించారని అడిగితే.. ‘వేరే ఆటగాడికి అవకాశం ఇస్తున్నాం’ అని మాత్రం చెప్పారు. ఆ తర్వాత నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రస్తుత కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాత్రం ఒక మెసేజ్ పంపాడు. జట్టులో ఉంటేనే ఏ ప్లేయర్‌కైనా విలువ ఉంటుంది. బయటకు వచ్చాక ఎవరూ పట్టించుకోరు.
‘నేను మేనేజ్‌మెంట్‌కు కాల్ చేసినా.. బిజీగా ఉన్నామంటూ నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. నాకు మళ్లీ జాతీయ జట్టులో అవకాశం వస్తుందా? లేదా? అనే దానిపై నాకూ స్పష్టత లేదు. కానీ, ఇంగ్లండ్ క్రికెట్‌లో అత్యుత్తమ వైట్ బాల్ ఆటగాళ్లలో నేనూ ఒకడిననే నమ్మకం నాకుంది. ఎవరో కొంత మంది వల్ల నేను జట్టులో లేకపోవచ్చు. కానీ ఆట పట్ల నాకున్న ఇష్టం, ఆడగలే సామర్థ్యం మాత్రం తగ్గిపోదు’ అని లివింగ్‌స్టోన్ అన్నాడు. ఇదిలా ఉండగా.. లివింగ్‌స్టోన్ చివరిసారిగా 2025 మార్చిలో ఇంగ్లండ్ తరఫున ఆడాడు. ప్రస్తుతం ఆయన ఫ్రాంచైజీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని రూ.13.6 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?