జింబాబ్వేతో రెండో వన్డే: టాస్ నెగ్గిన భారత మహిళా జట్టు
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:32 PM
వడోదర వేదికగా భారత్-జింబాబ్వే మహిళల జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: వడోదర వేదికగా భారత్-జింబాబ్వే మహిళల జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది. కాగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
భారత మహిళా తుది జట్టు:
స్మృతి మంధాన(కెప్టెన్), ప్రతీకా రావల్, షఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, తేజాల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, సయాలీ, శ్రీచరణి, జింటిమని కలిత
ఇవి కూడా చదవండి:
రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. రహానె ఆల్‌టైమ్ భారత టెస్టు జట్టు ఇదే!
వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు: అశ్విన్