Share News

అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. భారత తొలి ఓపెనర్‌గా..!

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:04 PM

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు.

అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. భారత తొలి ఓపెనర్‌గా..!
Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 21 బంతుల్లో 27 పరుగులు చేసిన అభిషేక్‌.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్‌ మూడో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(2022), ఇషాన్‌ కిషన్‌(2026) ఈ ఘనత సాధించారు. ఇప్పుడు అభిషేక్‌ కూడా వారి సరసన చేరాడు. అయితే భారత ఓపెనర్లలో ఈ మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు.


ఈ ఏడాది ఇప్పటివరకు 36 మ్యాచ్‌ల్లో అభిషేక్‌ 1012 పరుగులు సాధించాడు. భారత క్రికెట్‌లో టెస్టుల్లో ఒకే ఏడాది 1000 పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా సునీల్‌ గావస్కర్‌ రికార్డు నెలకొల్పగా.. వన్డేల్లో 1994లో సచిన్‌ టెండూల్కర్‌ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పుడు టీ20ల్లో అభిషేక్‌ తనదైన ముద్ర వేశాడు.


ఇవి కూడా చదవండి:

రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. రహానె ఆల్‌టైమ్ భారత టెస్టు జట్టు ఇదే!

వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు: అశ్విన్

Updated Date - Oct 25 , 2026 | 01:04 PM