Share News

భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట

ABN , Publish Date - Aug 25 , 2026 | 05:42 PM

కొలంబో వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అంతకుముందు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. కాగా మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 265/8.

భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట
India vs Sri Lanka

ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అంతకుముందు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. 84వ ఓవర్‌లో జడేజా బౌలింగ్ చేస్తుండగా వర్షం పడింది. దీంతో ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. స్టేడియం సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పేశారు. ఆటను కొనసాగించే పరిస్థితి కనిపించకపోవడంతో 83.4 ఓవర్ల వద్ద మూడో రోజు మ్యాచ్‌ను ముగించేశారు.


కాగా మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 265/8. క్రీజులో లాహిరు కుమార(8*), సోనాల్ దినుశా(85*) ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, మానవ్ సుతార్ 3, సిరాజ్, జడేజా తలొక వికెట్ పడగొట్టారు. భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు రెండో రోజు 503/9 వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోని ఆసక్తి.. నిరాకరించిన సీఎస్కే?

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ కాస్త వెనుకబడింది: రాహుల్ ద్రవిడ్

Updated Date - Aug 25 , 2026 | 05:42 PM