చివరి వన్డే: ఇంగ్లండ్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Jul 19 , 2026 | 07:35 PM
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియాకు 388 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ బెన్ డకెట్(141) భారీ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ జాకబ్ బెథెల్(91) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓపెనర్లు ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 192 పరుగులు జోడించారు.
జో రూట్(74*) అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు. డకెట్, రూట్ కలిసి రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బట్లర్(41*) పరుగులు చేశాడు. కెప్టెన్ బ్రూక్ మాత్రమే(14) నిరాశపర్చాడు. ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ధారాళంగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా లేని లోటు స్పష్టంగా తెలిసింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా గోల్డెన్ బూట్ రేసు.. ఎంబాపెను మెస్సి అధిగమించాలంటే..!
జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం