Share News

అండర్ 19 ఆసియా కప్: భారత్‌పై పాక్ విజయం

ABN , Publish Date - Nov 08 , 2026 | 06:21 PM

అండర్ 19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని పాక్.. 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అండర్ 19 ఆసియా కప్: భారత్‌పై పాక్ విజయం
U19 Asia Cup

ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని పాక్.. 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్ హంజా జహూర్(100*) అజేయ సెంచరీ చేశాడు. అబ్బాస్ దార్(38) పర్వాలేదనిపించాడు. తొలుత వెంటవెంటనే వికెట్లు పడగొట్టిన టీమిండియా.. ఆఖరిలో తడబడింది.


ఉస్మాన్ ఖాన్(16), జహంగీర్ బిలాల్(5), అబ్దుల్ కాదిర్(20), అహ్మద్ హుస్సేన్(8), ఫర్హాన్ యూసఫ్(2), మహ్మద్ సయ్యాం(4), నికాబ్(2*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మునాల్ చౌహాన్ 3, మోహిత్ ఉల్వా 2, ఇషాన్ సూద్, కావ్య పటేల్ తలొక వికెట్ పడగొట్టారు.


అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. 208 పరుగులకు ఆలౌటైంది. యువ బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్(107; 85 బంతుల్లో) సెంచరీతో చెలరేగాడు. వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్(22), ఆఖరిలో కావ్య పటేల్(23) పర్వాలేదనిపించారు. కెప్టెన్ లక్ష్య రాజేశ్‌ రాయ్‌ చందాని (0), యశ్‌బర్దాన్ చౌహాన్ (1), యశ్వీర్ గౌడ్ (4), వీకే వినీత్ (8), మోహిత్ ఉల్వా (7) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అన్వయ్ ద్రవిడ్ (10), మనల్ చౌహాన్ (11) పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో అలీ రజా 3, రిజ్వానుల్లా 3, నికాబ్ షాఫిక్ 3, సయ్యమ్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అందుకే ఓడిపోతున్నారు.. న్యూజిలాండ్ పిచ్‌లపై అంబటి రాయుడు విమర్శలు

అండర్ 19 ఆసియా కప్: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ.. పాక్ టార్గెట్ 209

Updated Date - Nov 08 , 2026 | 06:27 PM