వన్డేలకు తాత్కాలిక విరామం.. ఇండియా-ఎ జట్టు నుంచి రజత్ పాటీదార్ ఔట్!
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:11 PM
టీమిండియా బ్యాటర్ రజత్ పాటీదార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఫిట్‌నెస్ సమస్యలు, గాయాల కారణంగా కొంతకాలం పాటు 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా బ్యాటర్ రజత్ పాటీదార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఫిట్‌నెస్ సమస్యలు, గాయాల కారణంగా కొంతకాలం పాటు 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తనను వన్డే ఫార్మాట్‌లో ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోవద్దని బీసీసీఐని కోరాడు. దీంతో ఖతార్‌లో జరగనున్న ఏసీసీ పురుషుల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీ కోసం ఎంపిక చేసిన ఇండియా-ఎ జట్టు నుంచి కూడా అతడు తప్పుకున్నాడు.
‘ప్రస్తుతం గాయాల నుంచి కోలుకునే క్రమంలో, 50 ఓవర్ల ఫార్మాట్‌లో తనను ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోవద్దని రజత్ పాటిదార్ బీసీసీఐకి తెలియజేశాడు’ అని బోర్డు ఎక్స్ వేదికగా పేర్కొంది. పాటీదార్ స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనీకి జట్టులో బీసీసీఐ చోటు కల్పించింది. మరోవైపు యువ బ్యాటర్ రింకు సింగ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రజత్ తప్పుకోవడంతో తిలక్ వర్మ కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు సమాచారం. నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.
ఇవి కూడా చదవండి:
అందుకే ఓడిపోతున్నారు.. న్యూజిలాండ్ పిచ్‌లపై అంబటి రాయుడు విమర్శలు
అండర్ 19 ఆసియా కప్: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ.. పాక్ టార్గెట్ 209