అందుకే ఓడిపోతున్నారు.. న్యూజిలాండ్ పిచ్‌లపై అంబటి రాయుడు విమర్శలు
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:22 PM
న్యూజిలాండ్-భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. న్యూజిలాండ్ పిచ్‌ల తీరును తప్పుబట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్-భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. న్యూజిలాండ్ పిచ్‌ల తీరును తప్పుబట్టాడు. ఆక్లాండ్, వెల్లింగ్టన్ వేదికలుగా జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ వర్షం బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అయినప్పటికీ భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
‘న్యూజిలాండ్ వ్యూహం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడంపైనే ఆధారపడి ఉంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు వికెట్లు త్వరగా పడతాయనే ఆశతోనే వాళ్లు ఓ పందెం కాస్తున్నారు. కానీ కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. ప్రస్తుతం న్యూజిలాండ్ పరిస్థితి అదే. ఓ వైపు వర్షం, మరో వైపు టాస్ ఓడిపోవడం.. వాళ్లను దెబ్బతీస్తున్నాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే విధంగా ఆడేందుకు వీలుండే పిచ్‌ను సిద్ధం చేయాలి. లేదంటే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. అయినప్పటికీ భారత పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. త్వరత్వరగా వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని రాయుడు వ్యాఖ్యానించాడు.
టాస్‌కు మరొకరిని పంపాలేమో: మురళీ కార్తీక్
ఆడిన రెండు వన్డేల్లోనూ న్యూజిలాండ్ టాస్ ఓడింది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ సరదాగా స్పందించాడు. ‘శాంట్నర్‌కు అదృష్టం కలిసి రాట్లేదు. అందుకే వరుసగా టాస్‌లు ఓడిపోతున్నాడు. వాళ్లు కెప్టెన్‌ను కాకుండా మరొకరిని టాస్‌కు పంపించాలి. ఈ సిరీస్‌లో ఏడు టాస్‌లలో శాంట్నర్ ఆరు ఓడిపోయాడు. ఒక్కటే గెలిచాడు. ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నప్పుడు ప్రాక్సీ కెప్టెన్‌ను పంపించాల్సిందే’ అని కార్తీక్ చమత్కరించాడు.
ఇవి కూడా చదవండి:
మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..