Share News

40 రోజులు.. 12 మ్యాచ్‌లు.. న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:42 PM

అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు టీమిండియా.. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడనున్నాయి.

40 రోజులు.. 12 మ్యాచ్‌లు.. న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా
India tour of New Zealand 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ అభిమానులకు క్రేజీ న్యూస్. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2026-2027 అంతర్జాతీయ హోం సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భారత్‌తో జరిగే సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు టీమిండియా.. న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడనున్నాయి. మొత్తం 3 ఫార్మాట్లు.. 40 రోజులు.. 12 మ్యాచ్‌లు.. భారత అభిమానులకు పండుగే పండుగ! అయితే న్యూజిలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పర్యటన కావడం విశేషం. గతంలో ఏ దేశ క్రికెట్ జట్టు కూడా న్యూజిలాండ్‌ పర్యటనలో ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. అక్టోబర్ 22న టీ20, నవంబర్ 4న వన్డే, నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి.


పూర్తి షెడ్యూల్ ఇదే..

టీ20 సిరీస్:

  • తొలి టీ20- అక్టోబర్ 22, క్రైస్ట్‌చర్చ్

  • రెండో టీ20- అక్టోబర్ 24, క్రైస్ట్‌చర్చ్

  • మూడో టీ20- అక్టోబర్ 27, వెల్లింగ్టన్

  • నాలుగో టీ20- అక్టోబర్ 30, ఆక్లాండ్

  • ఐదో టీ20- నవంబర్ 1, హామిల్టన్

వన్డే సిరీస్:

  • తొలి వన్డే- నవంబర్ 4, ఆక్లాండ్

  • రెండో వన్డే- నవంబర్ 7, వెల్లింగ్టన్

  • మూడో వన్డే- నవంబర్ 10, హామిల్టన్

  • నాలుగో వన్డే- నవంబర్ 13, మౌంట్ మాంగనూయి

  • ఐదో వన్డే- నవంబర్ 15, మౌంట్ మాంగనూయి

టెస్ట్ సిరీస్:

  • తొలి టెస్టు- నవంబర్ 19-23, వెల్లింగ్టన్

  • రెండో టెస్టు- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు, క్రైస్ట్‌చర్చ్


ఇవి కూడా చదవండి:

ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?

Updated Date - Jun 03 , 2026 | 01:44 PM