ఐర్లాండ్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Jun 28 , 2026 | 07:53 PM
బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్-భారత్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత్‌కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్-భారత్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత్‌కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. బెంజమిన్ కాలిట్జ్(37) పర్వాలేదనపించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
టిమ్ టెక్టర్(5), రాస్ అడైర్(16), లోర్కాన్ టక్కర్ (15), గారెత్ డెలానీ(0), జార్జ్ డాక్రెల్(19), లియామ్ మెక్‌కార్తీ(2) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంలోనే 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అర్ష్‌దీప్ సింగ్ 2, శివం దూబె 2, హర్షిత్ రాణా 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్?
ప్రపంచ రోయింగ్ కప్: భారత్‌కు స్వర్ణం