Share News

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్

ABN , Publish Date - Jul 26 , 2026 | 08:28 PM

జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం.

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్
India vs Zimbabwe

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం. కాగా 193 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసేవరకు 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది.


జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేదు. వెస్లీ(28), బెన్ కర్రన్(20) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, యశ్ ఠాకూర్ 2, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలొక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(81) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.


ఇవి కూడా చదవండి:

జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

Updated Date - Jul 26 , 2026 | 08:31 PM