ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు.. జపాన్‌పై 4-1తో ఘన విజయం
ABN , Publish Date - Oct 30 , 2026 | 09:31 PM
పంజాబ్ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026లో భారత పురుషుల హాకీ జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: పంజాబ్ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. శుక్రవారం జరిగిన ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ దశలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ మొదటి క్వార్టర్‌లోనే అభిషేక్ నైన్ అద్భుతమైన టీమ్ మూవ్‌ను గోల్‌గా మలచి భారత్‌కు ఆధిక్యం అందించాడు. అయితే, మొదటి క్వార్టర్ చివరి క్షణాల్లో జపాన్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేసింది.
మూడో క్వార్టర్ ముగిసేవరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో స్కోరు సమానమైంది. చివరి 15 నిమిషాల్లో భారత ఆటగాళ్లు విజృంభించి ఏకంగా మూడు గోల్స్ సాధించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆ వెంటనే అభిషేక్ నైన్ తన రెండో గోల్ నమోదు చేయగా, మ్యాచ్ ముగిసే సమయానికి విష్ణుకాంత్ సింగ్ మరో గోల్ చేసి భారత్ విజయాన్ని లాంఛనం చేశాడు. ఈ టోర్నీలో జపాన్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. గురువారం చైనాను 5-2 తేడాతో భారత్ ఓడించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారాన్ని అమ్ముతున్నారా? అయితే..
పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫార్మా ఎగుమతులు రూ.1.54 లక్షల కోట్లు