Share News

ఫార్మా ఎగుమతులు రూ.1.54 లక్షల కోట్లు

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:21 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధం (హెచ్‌1)లో భారత ఔషధ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన దాదాపు 5 శాతం వృద్ధి చెంది 1,614 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి...

ఫార్మా ఎగుమతులు రూ.1.54 లక్షల కోట్లు

ప్రథమార్ధంలో 5 శాతం వృద్ధి నమోదు: ఫార్మెక్సిల్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధం (హెచ్‌1)లో భారత ఔషధ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన దాదాపు 5 శాతం వృద్ధి చెంది 1,614 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.54 లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఐరోపా, ఆసియాన్‌, లాటిన్‌ అమెరికా మార్కెట్ల నుంచి మన ఔషధాలకు బలమైన గిరాకీ లభించడం ఇందుకు దోహదపడిందని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) గురువారం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే కాలానికి ఫార్మా ఎగుమతులు 1,538 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఫార్మెక్సిల్‌ డేటా ప్రకారం.. ప్రథమార్ధంలో ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్‌, బల్క్‌ డ్రగ్స్‌, డ్రగ్‌ ఇంటర్మీడియెట్స్‌, సర్జికల్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదైంది.

రెండో త్రైమాసికంలో రూ.76,581 కోట్ల ఎగుమతులు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో ఔషధ ఎగుమతులు 3.05 శాతం పెరుగుదలతో 804 కోట్ల డాలర్లు (దాదాపు రూ.76,581 కోట్లు)గా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఎగుమతులు 780 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. కాగా, సెప్టెంబరు నెలలో అత్యధికంగా 274.40 కోట్ల డాలర్ల ఫార్మా ఎగుమతులు జరిగాయని, గత సెప్టెంబరుతో పోలిస్తే ఇది 4.68 శాతం అధికమని ఫార్మెక్సిల్‌ తెలిపింది.

ఐదో వంతు ఎగుమతులు యూర్‌పకే..: ఈ ప్రథమార్ధంలో యూర్‌పనకు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన దాదాపు 10 శాతం వృద్ధితో 328.82 కోట్ల డాలర్లకు చేరాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ మార్కెట్‌ వాటా 20.38 శాతానికి పెరిగిందని ఫార్మెక్సిల్‌ తెలిపింది. ఆసియాన్‌ దేశాలకు ఎగుమతులు 21.54ు పుంజుకోగా.. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ మార్కెట్లకు ఎగుమతులు 16.58 శాతం పెరిగాయి. ఆఫ్రికా మార్కెట్‌కు ఎగుమతులు 6.48 శాతం వృద్ధి చెందాయి. ఉత్తర అమెరికాకు ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ, ఇతర మార్కెట్ల నుంచి డిమాం డ్‌ పెరగడం కలిసివచ్చింది.


ఫార్ములేషన్లు, బయోలాజిక్స్‌దే 73.84 శాతం వాటా: మొత్తం ఎగుమతుల్లో డ్రగ్‌ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్‌దే 73.84 శాతం వాటా. వీటి ఎగుమతులు 3.81 శాతం పెరగగా.. బల్క్‌డ్రగ్స్‌, డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 12.07 శాతం, సర్జికల్‌ ప్రొడక్ట్స్‌ 9.53 శాతం పెరిగాయి.

అందుబాటు ధరల్లో నాణ్యమైన ఔషధాలను అందించడంతో పాటు పెద్దఎత్తున ఔషధాల తయారీ కేంద్రంగా భారత్‌ ప్రాచుర్యం పొందింది. అయితే, తదుపరి దశ వృద్ధి కోసం ఔషధ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. మన ఫార్మా కంపెనీలు కేవలం సరఫరాదారులుగానే మిగిలిపోకుం డా ఔషధ ఆవిష్కరణల్లో భాగస్వాములు కావాలి. సంక్లిష్ట జెనరిక్స్‌, బయోసిమిలర్స్‌, ప్రత్యేక థెరపీ ఔషధాలు సహా అభివృద్ధికి యూర్‌పలో గణనీయమైన అవకాశాలు ఉన్నాయి.

నమిత్‌ జోషి, చైర్మన్‌, ఫార్మెక్సిల్‌

ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 06:21 AM