Share News

తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారాన్ని అమ్ముతున్నారా? అయితే..

ABN , Publish Date - Oct 30 , 2026 | 09:13 PM

తల్లిదండ్రుల నుంచి బహుమతిగా వచ్చిన బంగారాన్ని విక్రయించే సమయంలో పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పన్ను ఎలా లెక్కిస్తారంటే..

తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారాన్ని అమ్ముతున్నారా? అయితే..
Tax on Selling Gold

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి లేదా ఇతర శుభకార్యాల్లో తల్లిదండ్రులు తమ సంతానానికి బహుమతిగా బంగారు ఆభరణాలు ఇస్తుంటారు. ఇలా బహుమతిగా వచ్చిన నగలను విక్రయించే సమయంలో పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత పన్ను చెల్లించాలనేది బంగారం కొనుగోలు ధర, ఎంత మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చిందీ అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


ఇన్‌కమ్ టాక్స్ చట్టాల ప్రకారం, తల్లిదండ్రుల నుంచి బంగారాన్ని బహుమతిగా అందుకునేటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. పన్ను చట్టాల్లో తల్లిదండ్రులను ప్రత్యేకంగా పరిగణించడమే ఇందుకు కారణం. కాబట్టి వారి నుంచి ఎంత మొత్తంలో బంగారం బహుమతిగా తీసుకున్నా ట్యాక్స్ కట్టనక్కర్లేదు. అయితే, బహుమతిగా తీసుకున్నట్టు ఆధారాలు రెడీ చేసి పెట్టుకోవడంతో పాటు బంగారం కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన బిల్లులను జాగ్రత్త చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి భవిష్యత్తులో అక్కరకు వస్తాయని అంటున్నారు.


విక్రయిస్తే వచ్చే లాభాలపై పన్ను..

తల్లిదండ్రుల నుంచి బహుమతిగా వచ్చిన బంగారాన్ని అమ్మినప్పుడు వచ్చే లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నగలు కొనుగోలు ధరకు, విక్రయధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లాభంగా పరిగణిస్తారు. ఈ లెక్కింపునకు సంబంధించిన రూల్స్ చట్టంలో స్పష్టంగా ఉన్నాయి. అంటే, బంగారాన్ని అమ్మినప్పుడు వచ్చిన లాభం నుంచి ఇతర ఖర్చులను మినహాయించి పన్ను లెక్కిస్తారని నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ఫార్మా ఎగుమతులు రూ.1.54 లక్షల కోట్లు

Updated Date - Oct 30 , 2026 | 09:38 PM