Share News

అది పెట్రోల్ షార్టేజ్ లీగ్.. పాకిస్థాన్‌ను ఎగతాళి చేసిన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:59 AM

ఇంధన కొరత వల్ల పీఎస్ఎల్‌ను కేవలం రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు, అది కూడా ప్రేక్షకులు లేకుండానే లీగ్‌ను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు వ్యంగ్యంగా స్పందించింది.

అది పెట్రోల్ షార్టేజ్ లీగ్.. పాకిస్థాన్‌ను ఎగతాళి చేసిన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు
PSL

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన కొరత కారణంగా పాక్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ నిర్వహణలో కీలక మార్పులు చేసింది. ఇంధన కొరత వల్ల కేవలం రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు, అది కూడా ప్రేక్షకులు లేకుండానే లీగ్‌ను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.


దీనిపై ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు వ్యంగ్యంగా స్పందించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఎగతాళి చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘పీఎస్ఎల్ రాబోతోంది. ఇది లక్షలాది మంది క్రికెట్ అభిమానులకు చాలా ఉత్సాహాన్ని కలిగించనుంది. పీఎస్ఎల్ అంటే ఇన్నిరోజుల నుంచి ఏంటో అని ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ తీరా చూస్తే దాని అర్థం ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్’ అని తెలిసింది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

హార్దిక్.. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకో: టీమిండియా మాజీ ప్లేయర్

ఐపీఎల్: ఒక సీజన్‌లో ఏ జట్టుకైనా హోమ్ గ్రౌండ్ ఒకటే ఉండాలి: అశ్విన్

Updated Date - Mar 23 , 2026 | 11:59 AM