Share News

ఐపీఎల్ 2026: జట్టుకు ఆరో టైటిల్ అందించడమే మా ఆశయం: హార్దిక్ పాండ్య

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:37 AM

ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: జట్టుకు ఆరో టైటిల్ అందించడమే మా ఆశయం: హార్దిక్ పాండ్య
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంఐకు ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందించడమే తమ లక్ష్యమని అన్నాడు. ముంబై వారసత్వాన్ని కొనసాగిస్తామని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.


‘ఐపీఎల్ టైటిల్‌ను ఆరోసారి ముంబై ఇండియన్స్‌కు అందించడమే మా ఆశయం. జట్టుకు ఇప్పటికే అద్భుతమైన వారసత్వం ఉంది. నేను కొత్తగా టీమ్‌లో చేరినప్పటికీ వారు నాకు అండగా నిలిచారు. నా ఎదుగుదలకు వారి మద్దతు ఎంతగానో సాయపడింది. నేను ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళదామనుకుంటున్నా. జట్టులోని ఆటగాళ్లు మంచి క్రికెట్ ఆడేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. ఉత్తమ ఆటకు మేం ప్రతిబింబంలా నిలవాలనుకుంటున్నాం. నా కోసం, జట్టు కోసం నేను వదలి వెళ్లాలనుకుంటున్న వారసత్వం ఇదే’ అని హార్దిక్ వెల్లడించాడు.


మా జట్టు ఓ అద్భుతం: పొలార్డ్

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ జట్టు గురించి మాట్లాడాడు. ‘మా జట్టు ప్లేయర్లు ప్రదర్శించే ధైర్యం, ఉత్సాహం అద్భుతం. ఇదంతా హార్దిక్ పాండ్య మా జట్టులోకి వచ్చినప్పటి నుంచే మొదలైందని నేను భావిస్తున్నాను. అతడు మైదానంలో చాలా కష్టపడతాడు. యువ క్రికెటర్లు మా శిబిరంలోకి వచ్చినప్పుడు నిర్భయంగా ఉంటారు. మాకు కావాల్సింది కూడా అదే. ముంబై ఇండియన్స్ అంటేనే దూకుడైన క్రికెట్! మా కుర్రాళ్లు మొదటి నుంచే సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం నన్ను చాలా ఉత్తేజపరుస్తోంది’ అని పొలార్డ్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

హార్దిక్.. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకో: టీమిండియా మాజీ ప్లేయర్

ఐపీఎల్: ఒక సీజన్‌లో ఏ జట్టుకైనా హోమ్ గ్రౌండ్ ఒకటే ఉండాలి: అశ్విన్

Updated Date - Mar 23 , 2026 | 11:38 AM