Share News

ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు.. కెప్టెన్‌గా సంజు శాంసన్?

ABN , Publish Date - Mar 23 , 2026 | 10:06 AM

టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు రాబోయే పర్యటనలకు సంబంధించి బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు.. కెప్టెన్‌గా సంజు శాంసన్?
India tour of Ireland 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు రాబోయే పర్యటనలకు సంబంధించి బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ కప్ తర్వాత టీమిండియా.. ఐర్లాండ్‌తో తలపడనుంది. అక్కడ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.


దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఎనిమిదేళ్లుగా భారత జట్టు మూడుసార్లు ఐర్లాండ్‌లో పర్యటించింది. ఆ మ్యాచ్‌లన్నీ డబ్లిన్ సమీపంలోని మలాహిడ్‌లోనే జరిగాయి. 2007 తర్వాత మొట్టమొదటిసారిగా భారత జట్టు బెల్‌ఫాస్ట్‌లో అడుగు పెట్టనుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తొలి టీ20, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది.


సంజుకు కెప్టెన్సీ?

భారత జట్టు ఐర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసిన సంజు శాంసన్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజు.. తన అనుభవంతో జట్టును ముందుండి నడిపించే అరుదైన అవకాశం రావొచ్చు.


వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

ఐర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఓపెనింగ్ స్థానాల కోసం పోటీ నెలకొంది. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉన్న బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది. వారి స్థానాల్లో యశస్వి జైస్వాల్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు షెడ్యూల్ బిజీగా ఉండనుంది. తొలుత అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20లు, జులై 1 నుంచి 19 వరకు ఇంగ్లండ్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

హార్దిక్.. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకో: టీమిండియా మాజీ ప్లేయర్

ఐపీఎల్: ఒక సీజన్‌లో ఏ జట్టుకైనా హోమ్ గ్రౌండ్ ఒకటే ఉండాలి: అశ్విన్

Updated Date - Mar 23 , 2026 | 10:28 AM