మియామి ఓపెన్: అల్కరాజ్‌పై కోర్డా సంచలన విజయం
ABN , Publish Date - Mar 23 , 2026 | 10:33 AM
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సంచలనం విజయం నమోదైంది. ప్రపంచ వన్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్‌పై ప్రపంచ 36వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా ఘన విజయం సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సంచలనం విజయం నమోదైంది. ప్రపంచ వన్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్‌పై ప్రపంచ 36వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా ఘన విజయం సాధించాడు. సోమవారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం) జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 3-6, 7-5, 4-6తో సెబాస్టియన్ చేతిలో ఓటమిని చవిచూశాడు.
రెండు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో కోర్డా తొలి సెట్ నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి సెట్‌ను 6-3తో సునాయాసంగా నెగ్గిన కోర్డా.. రెండో సెట్‌లో తడబడి వెనకబడ్డాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో పుంజుకుని పదునైన సర్వీసులతో అల్కరాజ్‌ను మట్టికరిపించాడు. దీంతో తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన అల్కరాజ్.. తన కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేసుకున్నాడు. మియామి ఓపెన్ కంటే ముందు జరిగిన ఇండియన్ వేల్స్ టోర్నీలో మంచి ఆరంభంతోనే మొదలుపెట్టిన అల్కరాజ్ సెమీస్ దశలో వెనుదిరిగాడు. డానిల్ మెద్వెదెవ్ చేతిలో అల్కరాజ్ ఓటమిపాలయ్యాడు. ఈ ఓటమితో అల్కరాజ్(17) వరుస విజయాలకు బ్రేక్ పడింది. మరోవైపు సెబాస్టియన్ కోర్డా ప్రీ క్వార్టర్స్‌లో కచనోవ్ లేదా మర్టిన్ ల్యాండ్‌లూస్‌ల్లో ఒకరితో తలపడనున్నాడు.
ఇవి కూడా చదవండి:
హార్దిక్.. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకో: టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్: ఒక సీజన్‌లో ఏ జట్టుకైనా హోమ్ గ్రౌండ్ ఒకటే ఉండాలి: అశ్విన్