ఛాంపియన్స్ ట్రోఫీ: శ్రీలంక ఆతిథ్య హక్కులు తొలగించిన ఐసీసీ
ABN , Publish Date - Aug 30 , 2026 | 02:18 PM
శ్రీలంక క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2027లో తొలిసారి జరగనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఇక శ్రీలంకలో జరగదు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2027లో తొలిసారి జరగనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఇక శ్రీలంకలో జరగదు. ప్రత్యామ్నాయ వేదికపై పోటీలు నిర్వహించనున్నారు. అయితే టోర్నీని ఏ దేశానికి తరలించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తదుపరి ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ నియమించిన ‘ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ’ ఎస్‌ఎల్‌సీని నిర్వహిస్తోంది. అయితే సభ్య దేశాల క్రికెట్ బోర్డులు ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా పనిచేయాలన్నది ఐసీసీ నిబంధన.
రెండేళ్లలో రెండోసారి..
శ్రీలంకకు ఐసీసీ టోర్నీ ఆతిథ్యం చేజారడం ఇదేమీ తొలిసారి కాదు. 2023లో ప్రభుత్వ జోక్యం ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 2024 పురుషుల అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్యాన్ని కూడా శ్రీలంక కోల్పోయింది. ఆ టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరు జట్లు పాల్గొనాల్సి ఉంది. తొలుత ర్యాంకింగ్స్‌లో ముందున్న జట్లతో పాటు ఆతిథ్య దేశానికి కూడా చోటు కల్పించేలా అర్హత విధానం రూపొందించారు. ప్రస్తుతం శ్రీలంక ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆతిథ్య హక్కులు మరో దేశానికి దక్కితే.. శ్రీలంక ఈ టోర్నీలో ఆడుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ర్యాంకింగ్స్‌లో అర్హత లేని దేశానికి ఆతిథ్యం దక్కితే అర్హత నిబంధనలను ఎలా మార్చాలన్న అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి కొత్త అర్హత విధానాన్ని ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి:
అప్పుడు సంజు రియాక్షన్ చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్
అదరగొట్టిన మెస్సి.. ఒకే మ్యాచ్‌లో నాలుగు గోల్స్.. వీడియో వైరల్