ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్.. రేసులో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:54 PM
టిమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డ్ రేసులో ఉన్నారు. అటు టీ20ఐలో అభిషేక్ శర్మ, ఇటు వన్డేలో శుభ్‌మన్ గిల్ బౌలర్లపై విరుచుకుపడి ఈ నామినేషన్స్‌కు సెలెక్ట్ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ నెలకు గానూ ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్ల జాబితాను ఈరోజు (మంగళవారం) ఐసీసీ విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఈ అవార్డు రేసులో ఉన్నారు. అలాగే జింబాబ్వే ఆల్-రౌండర్ సికందర్ రజా కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయ్యాడు. అటు టీ20ఐలో అభిషేక్ శర్మ, ఇటు వన్డేలో శుభ్‌మన్ గిల్ బౌలర్లపై విరుచుకుపడి ఈ నామినేషన్స్‌కు సెలెక్ట్ అయ్యారు.
సెప్టెంబర్‌లో టీమిండియా, అఫ్గానిస్థాన్‌ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఆ సిరీస్‌లో 229 పరుగులు చేసి బీభత్సం సృష్టించాడు. మొదటి టీ20లో కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ మ్యాచ్‌లో 32 బంతులకు 82 పరుగులు చేసి, అభిమానులను ఆకట్టుకున్నాడు. మూడో టీ20లో మాత్రం 30 బంతుల్లో సెంచరీ చేసి పలు రికార్డ్‌లు బ్రేక్ చేశాడు.
మరోవైపు అదే నెలలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేశాడు. 133 బంతుల్లో 223 పరుగులు సాధించి, నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్‌తో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరిస్‌లో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా ప్రతిభ కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో 183 పరుగులు సాధించాడు.
ఈ వార్తలూ చదవండి
భారత టీ20 జట్టుపై ప్రశ్న.. రిపోర్టర్‌కు గిల్ షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్
వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య