Share News

న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు జరిమానా

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:55 PM

టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత విధించింది.

న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు జరిమానా
Team India

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత విధించింది. నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన ఓవర్ల కంటే ఏడు ఓవర్లు తక్కువగా వేసినట్లు మ్యాచ్‌ రిఫరీ గుర్తించారు.


ఐసీసీ ప్లేయర్స్ అండ్ ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్‌కు పాల్పడిన జట్టులోని ఆటగాళ్లకు ప్రతి ఓవర్ ఆలస్యానికి మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. గరిష్ఠంగా 50 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు ఓవర్లు ఆలస్యంగా బౌలింగ్ చేయడంతో మొత్తం 35 శాతం జరిమానా పడింది. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన తప్పిదాన్ని అంగీకరించి జరిమానాను అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే వ్యవహారం ముగిసింది. ఇదిలా ఉండగా, ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 18 , 2026 | 08:56 PM