Share News

టెస్టు క్రికెట్‌లో లిటన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒకే ఇన్నింగ్స్‌లో 8 డిస్మిసల్స్!

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:13 PM

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 మంది బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు.

టెస్టు క్రికెట్‌లో లిటన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒకే ఇన్నింగ్స్‌లో 8 డిస్మిసల్స్!
Litton Das

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 మంది బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది డిస్మిసల్స్ నమోదు చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. దీంతో వసీమ్ బారీ(పాకిస్థాన్), బాబ్ టేలర్(ఇంగ్లండ్), ఇయాన్ స్మిత్(న్యూజిలాండ్), రిడ్లీ జాకబ్స్(వెస్టిండీస్), జాషువా డి సిల్వా(వెస్టిండీస్) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును లిటన్ బద్దలు కొట్టాడు. వీరంతా ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు డిస్మిసల్స్‌లో భాగమయ్యారు.


లిటన్ దాస్ ఈ ఘనత సాధించడం మరింత ప్రత్యేకం. ఎందుకంటే వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో వచ్చిన లిటన్ సెంచరీతో చెలరేగాడు. 179 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు ఎనిమిది డిస్మిసల్స్‌లో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా మరో అరుదైన ఘనత అందుకున్నాడు.


కాగా తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 557, బంగ్లాదేశ్ 400 పరుగులకు ఆలౌటయ్యాయి. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోరు. నాలుగో రోజు(బుధవారం) ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులతో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 18 , 2026 | 08:13 PM