ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:48 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఘాటుగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. విధ్వంసకర బ్యాటర్లు ఉన్నప్పటికీ జట్టుకు ఓటములు తప్పట్లేదు. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు ఓడి కేవలం ఒక్కటే మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్ లేకపోవడం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఘాటుగా స్పందించాడు. జట్టు బౌలింగ్‌పై వస్తోన్న విమర్శలను ఖండించాడు.
‘ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మేము దాదాపు 40 పరుగులు తక్కువ చేశాం. బ్యాటింగ్ ఇంకా చాలా మెరుగుపరుచుకోవాలి. ఒక టీమ్‌లో కమిన్స్ లాంటి ఆటగాడు లేకపోవడం పెద్ద లోటే. కానీ ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపించడం సరైంది కాదు. ఓటములకు బ్యాటర్లే బాధ్యత వహించాలి. మా బ్యాటింగ్ యూనిట్ లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో కనీసం 220-230 పరుగులు చేయాలని నిర్ణయించాం. భారీ స్కోర్లు సాధిస్తేనే బౌలర్లకు మ్యాచ్‌ను కాపాడే అవకాశం ఉంటుంది. బౌలర్లు అనుభవం లేని వారంటూ విమర్శించడం సులభం. కానీ మేమే 20-30 పరుగులు తక్కువ చేశాం. మేము మా పని సరిగ్గా చేస్తే బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుంది’ అని క్లాసెన్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు