సినీ నటితో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ ప్రేమాయణం!
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:48 PM
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్ష్‌దీప్ ఇటీవలే తన స్నాప్‌చాట్ అకౌంట్లో ఓ యువతితో చేతులు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: సినీ, క్రీడా రంగాలకు చెందిన వారి ప్రేమలు, డేటింగ్స్ వంటి వాటి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. వీటిల్లో కొన్ని నిజం కాగా.. మరికొన్ని పుకార్లుగా మిలిగిపోతుంటాయి. తాజాగా.. టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్ష్‌దీప్ ఇటీవలే తన స్నాప్‌చాట్ అకౌంట్లో ఓ యువతితో చేతులు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అందులో ఆమె ముఖం కనిపించకపోయినప్పటికీ, నెట్టిజన్లు ఓ చిన్న క్లూ ద్వారా ఆమె ఎవరో కనిపెట్టేశారు. ఫలానా నటి అంటూ నెటిజన్లే వివరాలు చెప్పేస్తున్నారు.
అర్ష్‌దీప్ పట్టుకున్న ఆ అమ్మాయి చేతిపై ఒక ప్రత్యేకమైన టాటూ ఉంది. పంజాబ్‌కు చెందిన మోడల్, నటి సమ్రీన్ కౌర్(Samreen Kaur) చేతిపై కూడా సరిగ్గా అదే టాటూ ఉంటుంది. దీంతో అర్ష్‌దీప్ చేయి పట్టుకున్న అమ్మాయి ఆమెనేనని, వారిద్దరూ లవ్‌లో ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా సమ్రీన్ పీబీకేఎస్ జెర్సీ ధరించి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.
పంజాబ్‌కు చెందిన సమ్రీన్(26).. పుణేలోని సింబయాసిస్ కాలేజీలో చదువుకుంది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ చిత్రాలలో నటించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. '83' అనే బాలీవుడ్ మూవీలో కూడా ఆమె నటించింది. 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. మరోవైపు ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఇటు అర్ష్‌దీప్ కానీ, అటు సమ్రీన్ కానీ స్పందించలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో విషయం ఉందన్న వార్త మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు