Share News

ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:12 AM

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ధురంధర్-2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు నాలుగు గంటల పాటు కనురెప్ప వాల్చకుండా ఈ సినిమా చూశానంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
Dhurandar-2 success

స్పోర్ట్స్ డెస్క్: బాక్సాఫీస్ వద్ద ధురందర్-2 హవా కొనసాగుతూనే ఉంది. గతనెలలో ఉగాది(మార్చి 19) సందర్భంగా విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ధురందర్-2 రిలీజై చాలా రోజులు అయినప్పటికీ..నేటికీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ఐపీఎల్ 2026లో బిజీ బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ.. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి తాజాగా ధురందర్-2 మూవీని తిలకించారు. అనంతరం ఈ మూవీపై విరాట్ రివ్యూ ఇచ్చారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ చాలా తెలివైన వ్యక్తి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.


'ఈరోజు సినిమా చూశాను. భారత్‌లో ఇలాంటి సినిమా అనుభవాన్ని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అన్ని రకాల భావోద్వేగాలను ఈ సినిమా బయటకు తీసుకువచ్చింది. దాదాపు 4 గంటల పాటు నేను ఒక్కసారి కూడా కనురెప్ప వాల్చలేదు. ఆదిత్య ధర్.. మీరు సృష్టించిన దానిలో మీ ప్రతిభ, నిబద్ధత విజయం సాధించారు. మీకు హ్యాట్స్ ఆఫ్. నటీనటులందరూ తమ పాత్రలలో అద్భుతంగా నటించినప్పటికీ, రణ్‌వీర్ సింగ్ ఈ సినిమా తర్వాత మీరు చాలా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. మీ నటన అద్భుతానికి మించినది' అని విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

ప్రైజ్ ట్యాగ్: కామెరూన్ గ్రీన్ మరోసారి విఫలం..కేకేఆర్

సాత్విక్‌ జోడీ అవుట్‌

Updated Date - Apr 07 , 2026 | 08:21 AM